దేవరకద్ర: జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళితే కుక్క కరిస్తే వేసే టీకాను ఇంజక్షన్ చేసిన సంఘటన దేవరకద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళితే కుక్క కరిస్తే వేసే టీకాను ఇంజక్షన్ చేసిన సంఘటన దేవరకద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దేవరకద్ర మండలం బల్సుపల్లి గ్రామానికి చెందిన నాగరాజుకు వారం క్రితం జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ శరత్ చంద్రకు చూయించుకోగా.. డాక్టర్ ఇంజక్షన్ వేయించుకోవాలని సూచించారు. కాగా ఆసుపత్రిలో ఉన్న ఏఎన్ఎం.. నాగరాజుకు జ్వరంకు ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఇవ్వక.. కుక్క కరిచినప్పుడు ఇచ్చే రేబిస్ టీకాను ఇంజక్షన్ చేసింది. గమనించిన నాగరాజు డాక్టర్ శరత్ చంద్రకు ఫిర్యాదు చేయగా పొరపాటున రెబిస్ ఇంజక్షన్ వేశారని ఏమి కాదు అని సమాధానం ఇచ్చారు. రెబిస్ టీకా వేయడంతో ఎప్పుడు