ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని బాలాజీ రావు పేట లోని అమ్మవారి దేవస్థానం లో 108 కళాశాల ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. భవాని మారలు ధరించిన దీక్షాపరులు నృత్యాలతో భక్తులను అలరించారు అనంతరం నిర్వహించిన నగరొత్సవ కార్యక్రమంలో మాలధారణ చేపట్టిన దీక్షపరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా బాలాజీ రావు పేట లోని పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో భక్తులు ఆలయ ధర్మకర్తలు మాల ధారణ చేసిన దీక్షాపరుల ఆధ్వర్యంలో ప్రత్యేకమైన విశేష పూజలను నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో భాగంగా మేళతాళాలతో దీక్షాపరులు నృత్యం చేస్తూ స్థానికులను ఉత్సాహపరిచారు