ఎన్ని కేసులు పెట్టిన హైందవ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తా: భూమన
వైఖానస ఆగమ శాస్త్రం తెలియని వాళ్ళు నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎన్ని కేసులు పెట్టినా హైందవ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తానని ఉమ్మడి శత్రువు ఉన్నదీక్ష భూముల కరుణాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అలిపిరి వద్ద ఘోరమైన అపచారం జరుగుతోందని చెబితే తప్పుడు కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారని అది శనీశ్వర విగ్రహం అని చెప్తున్నారని శంకు చక్రాలు ధరించిన విగ్రహం ఎలా శనీశ్వర విగ్రహం అవుతుందని ప్రశ్నించారు.