తాడికొండ: కొన్ని నెలల క్రితం తప్పిపోయిన లక్ష్మి, ఇద్దరు పిల్లలను సురక్షితంగా గుర్తించి వారి బంధువులకు అప్పగించిన పోలీసులు
కొన్ని నెలల క్రితం కనిపించకుండా పోయిన కంతేరు గ్రామానికి చెందిన కట్టా లక్ష్మి అనే మహిళ, తన ఇద్దరు పిల్లలతో సహా సురక్షితంగా తల్లిదండ్రులకు పోలీసులు మంగళవారం అప్పగించారు. భర్త సరిగా చూసుకోవడం లేదనే మనస్థాపంతో ఇంటిని వదిలి వెళ్లిపోయినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. మంగళగిరి రూరల్ పోలీసులు ఈ కేసు నమోదు చేసి, తప్పిపోయిన వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. లక్ష్మి కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.