అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ వాసవి కళ్యాణమంటపంలో గురువారం బెంగళూరుకు చెందిన శంకర్ కంటి ఆసుపత్రి వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శంకర్ కంటి ఆసుపత్రి వైద్య అధికారులు శివ ప్రకాష్, శివ శంకర్ల పర్యవేక్షణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఉదయం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన 60 మందికి కంటి పరీక్షల నిర్వహించి 30 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించి బెంగళూరు శంకర్ కంటి ఆసుపత్రికి ప్రత్యేక బస్సులు తీసుకెళ్లారు. మరో 15 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు.