నారాయణపేట్: పరిమితికి మించి ఆటోలలో విద్యార్థులను తీసు కెళుతున్న ఆటోల పై కేసులు: టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు
నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు ప్రత్యేకత ఎన్నికలు నిర్వహించారు. ప్రత్యేకత తనిఖీల లో పాఠశాల విద్యార్థులను అధిక సంఖ్యలో ఆటోలలో తరలిస్తున్న ఆరుగురు ఆటో డ్రైవర్లను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు పిల్లల ప్రాణాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ చేయరాదని పిల్లల ప్రాణాలతో చెలగాటమాడరాదని హెచ్చరించారు.