సంతనూతలపాడు ఎమ్మెల్యే BN విజయ్ కుమార్ సంతనూతలపాడు లోని తన కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు రూ.44,51,658 లు విలువచేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకున్న పేదలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయాన్ని చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.