బందరు అభివృద్ధిని అడ్డుకుంటున్న పేర్ని నాని అంటూ అరోపిస్తున్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర
Machilipatnam South, Krishna | Sep 17, 2025
అభివృద్ధిని అడ్డుకుంటున్న పేర్ని నాని: మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణ స్తానిక మచిలీపట్నం అభివృద్ధిని వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని అడ్డుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. బుధవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. మున్సిపాలిటీ పాలకవర్గంలో ఉన్న వైసీపీ కార్పొరేటర్లు అభివృద్ధి పనులకు సహకరించడం లేదని మండిపడ్డారు. అంతేకాక, మున్సిపాలిటీ చరిత్రలోనే తొలిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టలేదని విమర్శించారు.