ఉరవకొండ: పోటాపోటీగా వాలీబాల్, కోకో క్రీడా పోటీలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సోమవారం ఉదయం నుండి సాయంత్రం 4:30 గంటల వరకు అండర్ 14, అండర్ 17 వాలీబాల్, కోకో స్కూల్ గేమ్స్ పోటీలు పోటాపోటీగా సాగాయి. క్రీడా పోటీలను ఎంఈఓ 2 హరికృష్ణ హెచ్ఎం వెంకటప్రసాద్ లు టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జునలతో కలిసి ప్రారంభించారు. వాలీబాల్ పోటీల్లో నరసాపురం బెలుగుప్ప జట్లు కోకో పోటీల్లో నరసాపురం అంకంపల్లి జట్లు విజేతలుగా నిలిచాయి. బెలుగుప్ప విద్యార్థులకు క్రీడా దుస్తులను టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున నాయకులు పెద్ద తిప్పయ్య లు వితరణ చేశారు.