రాజానగరం: పాఠశాల విద్యారంగ సమస్యలపై ఈ నెల 25న విజయవాడలో రణభేరి బహిరంగ సభ : పిడిఎఫ్ ఎమ్మెల్సీ గోపి మూర్తి
పాఠశాల విద్యారంగ సమస్యలపై ఈ నెల 25న విజయవాడలో యూటీఎఫ్ నిర్వహిస్తున్న రణభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి కోరారు. బుధవారం రాజమండ్రి కోరుకొండ రోడ్డు లో ఉన్న యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్న ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు అన్నారు. ఉపాధ్యాయులపై యాప్ల భారం పెరిగింది అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా శక్తి కార్యక్రమాలు, పరీక్షల మూల్యాంకనాలు, ఆన్లైన్లో అప్లోడ్, గ్రీన్ పాస్పోర్ట్ మొదలైన బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు.