హిమాయత్ నగర్: అల్లాపూర్ డివిజన్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహించిన టిపిసిసి ఉపాధ్యక్షుడు బండి రమేష్
అల్లాపూర్ డివిజన్లోని గాయత్రీ నగర్ లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఆదివారం ఉదయం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు గత పది సంవత్సరాలలో అభివృద్ధి లోపాన్ని నాసిరకం పనులను వివరించారు. కాంట్రాక్టర్లకు మాత్రమే మేలు జరిగిందని ప్రజలకు ఉపయోగ లేదని ప్రజలు తెలిపారు. స్పందించి నాయనా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.