ఆదోని: ఆదోని జిల్లా అయితే అభివృద్ధి సాధ్యం
Adoni, Kurnool | Sep 17, 2025 ఆదోని జిల్లా సాధన ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి భీమాస్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. జిల్లా సాధనకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కన్వీనర్ నూరు అహ్మద్ పిలుపునిచ్చారు. ఆదోని జిల్లాతోనే ప్రజల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం అవుతాయన్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఆదోని నియోజకవర్గం పూర్తిస్థాయిలో వెనుకబడిందన్నారు.