గిద్దలూరు: కంభం పట్టణంలో ఆటో ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలించిన స్థానికులు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ఏబీఏం చర్చి సమీపంలో బుధవారం ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని అంబులెన్స్ లో కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు కంభం కు చెందిన ప్రకాష్, మల్లికార్జున పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిలో ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆటో డ్రైవరు ఫుల్లుగా మద్యం సేవించి ఆటో నడపడం వల్లే ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా క్షతగాత్రులు చెబుతున్నారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.