భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శివరాజ్ అన్నారు. గుంతకల్లులో శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివరాజ్ మాట్లాడారు. రాజ్యాంగాన్ని రాసి అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.