ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మహిళలకు శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల కలుగు ప్రయోజనాలు భద్రతపై పోలీసు అధికారులు మహిళలకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో శక్తి యాప్ ద్వారా పోలీసులను సంప్రదించినట్లయితే పోలీసులు నిమిషాల వ్యవధిలో వారి వద్దకు చేరుకొని వారికి రక్షణ కల్పిస్తారని పోలీసు సిబ్బంది మరియు అధికారులు మహిళలకు తెలిపారు.