సిద్దిపేట అర్బన్: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ మంగళవారం సందర్శించారు. ఈ మేరకు రికార్డ్స్ మరియు క్రైమ్ ఫైల్స్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ కేసులలో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని ఏసీపీకి సూచించారు. పెండింగ్ ఉన్న OE త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసిపి రవీందర్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, సిసిఆర్పి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు పాల్గొన్నారు.