తెల్ల దొరల వెన్నులో వణుకు పుట్టించిన ధీరుడు వడ్డే ఓబన్న అని కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ లక్ష్మీదేవి అన్నారు. కళ్యాణదుర్గంలోని ప్రజా వేదికలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు ఆదివారం మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అందరూ వడ్డే ఓబన్నను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్,టీడీపీ సీనియర్ నాయకులు మల్లికార్జున, గోళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.