పట్టణంలోని స్కిట్ కళాశాల సమీపంలో యువకుడి పై దాడి చేసి 30 వేల నగదు లాక్కున్న గుర్తుతెలియని వ్యక్తులు
యువకుడిపై దాడి.. నగదు దోపిడీ శ్రీకాళహస్తిలో గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిపై దాడి చేసి రూ.30 వేల నగదును దోచుకున్నారు. స్థానికులు, బాధితుడి సమాచారం మేరకు.. యూపీకి చెందిన విమలేంద్ర యాదవ్ చెన్నై రోడ్డులోని ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. పట్టణంలోని బీపీ అగ్రహారంలో గదిలో అద్దెకు ఉంటున్నాడు. జీతం తీసుకుని రూమ్‌కి వెళ్తున్న యువకుడిని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై తీసుకువెళ్లి దాడి చేశారు. అతన్ని బెదిరించి నగదు దోచుకున్నారు.