ప్రకాశం జిల్లా పొదిలి కొనకనమిట్ల మండలాలలో శుక్రవారం తెల్లవారుజామున భూప్రకంపనలు వచ్చాయి. దీంతో నిద్రిస్తున్న స్థానికులు ఒకసారిగా ఇంటి నుండి బయటకు పరుగులు తీశారు. సుమారు మూడు సెకన్ల పాటు పెద్ద శబ్దాలతో భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. సంవత్సరకాలంలో రెండు మూడు సార్లు భూప్రకంపనలు రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.