తంబళ్లపల్లిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ ప్రత్యేక వైద్య శిబిరాలు ప్రారంభం
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ ప్రత్యేక వైద్య శిబిరాలను బుధవారం వైద్య సిబ్బంది ప్రారంభించారు. వైద్యాధికారిణి తేజస్విణి మాట్లాడుతూ మహిళలకు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాలు ఈనెల 17 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించి,మహిళలు, చిన్నపిల్లలకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామన్నారు