సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపడతాం: ఏరియా కార్యదర్శి యాదగిరి
సంగారెడ్డి మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సీపీఎం ఏరియా కార్యదర్శి యాదగిరి అన్నారు. సంగారెడ్డిలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. చాలా కాలనీలో వీధి దీపాలు కూడా వెలగడం లేదని చెప్పారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన బాట చేపడుతామని హెచ్చరించారు.