ఓజోన్ పొర దినోత్సవ సందర్భంగా పట్టణంలో విద్యార్థుల ర్యాలీ
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఎస్టి ఎస్ ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్, క్లైమేట్ యాక్షన్ కమిటీ ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ రసాయన శాస్త్ర విభాగాల సంయుక్తంగా ఓజోన్ దినోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ పట్టణంలో ర్యాలీ చేశారు. ప్రిన్సిపల్ స్మిత మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఓజోన్ పొరను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేశారు.