హిమాయత్ నగర్: జూబ్లీహిల్స్ లో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని ఎన్నికల అధికారిని కోరిన మాజీ మంత్రి హరీష్ రావు
హిమాయత్ నగర్ పరిధిలోని ఆదర్శనగర్ లో ఎన్నికల అధికారి కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల అధికారికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని ఆయనను మాజీ మంత్రి హరీష్ రావు కోరారు.