ఆత్మకూరు: చీకటిలో మగ్గుతున్న సోమశిల జలాశయం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, సోమశిల జలాశయం చీకటిలో మగ్గుతుందని మండల సిపిఎం పార్టీ నాయకులు అన్వర్ భాష పేర్కొన్నారు. ఆర్భాటంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పెన్నా డెల్టాకు నీటి విడుదలను క్రస్ట్ గేట్ల ద్వారా చేపట్టారని అన్నారు. జలాశయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి విద్యుత్తు దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రయాణికులు ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలియజేశారు. ఇకనైనా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జలాశయ అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.