భువనగిరి: మహిళల ఆరోగ్యానికి అన్ని ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బోనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బుధవారం మాట్లాడుతూ మహిళల ఆరోగ్యానికి అన్ని ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని,ఏ ఇంట అయితే స్త్రీ ఆరోగ్యంగా ఉంటుందో ఇంటిల్లిపాదిని జాగ్రత్తగా చూసుకుంటుందన్నారు.మా ప్రజా ప్రభుత్వంలో కూడా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి ముందుకెళ్తున్నామన్నారు.ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడుతారో ఆ సమాజం సన్మార్గంలో ముందుకెళ్తుందన్నారు.