హత్నూర: హైదరాబాదులో అందెశ్రీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి : ప్రముఖ చరిత్ర పరిశోధకులు డా.సంగిశెట్టి శ్రీనివాస్
హైదరాబాదులో తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రముఖ చరిత్ర పరిశోధకులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం గర్వించే జయ జయహే తెలంగాణ గీతాన్ని రచించిన ఘనత అందెశ్రీకి దక్కిందని చెప్పారు. అందెశ్రీ పేరుతో జానపద కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. అందెశ్రీ అభిమాన సంఘం నాయకుడు అందెశ్రీ అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు.