కనిగిరి: డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించే సిఐటియు 18 వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు జెవి కొండారెడ్డి కోరారు. కనిగిరి పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిఐటియు మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను కొండారెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఏకైక కార్మిక సంస్థ సిఐటియు మాత్రమే అన్నారు. విశాఖలో జరిగే మహాసభలకు ప్రకాశం జిల్లా లోని అన్ని మండలాల నుండి కార్మికులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.