నిజామాబాద్ సౌత్: పర్యాటకులను ఆకర్షించేలా మినీ ట్యాంక్ బండ్ ను తీర్చిదిద్దాలి: నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ ప్రదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మినీ ట్యాంక్ బండ్ తో పాటు న్యాల్ కల్ రోడ్ ఆర్టీసీ డిపో-2, పద్మానగర్, గౌతంనగర్ తదితర ప్రాంతాలను సందర్శించారు. ఆయా ప్రదేశాలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి అనువైన పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద ఆహ్లాదకర వాతావరణం, ఉద్యానవనం ఉండటంపై అభినందించారు.