ఇబ్రహీంపట్నం: షాపూర్ నగర్ లో ఒక పాఠశాలలో చిన్నారిపై దాడి చేసిన ఆయా, పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబీకులు
షాపూర్ నగర్ లోని ఒక పాఠశాలలో చిన్నారిపై ఆయా దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితులు సోమవారం మధ్యాహ్నం మాట్లాడుతూ వివరాలను తెలిపారు. అంతకు ముందు కూడా ఆయా తినాలని కొట్టిందని అయితే చిన్నారిని కొట్టడం చూసి వేరే వాళ్ళు వీడియో తీసి పెట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని కుటుంబీకులు తెలిపారు. స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా చిన్నదే కదా వదిలేయండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని అన్నారు. ఆయా పై చర్యలు తీసుకోవాలని అన్నారు.