ఆదోని: SC, STసబ్ ప్లాన్ నిధులు విడుదల చేయాలి : దళిత హక్కుల పోరాట సమితి నాయకుల డిమాండ్
Adoni, Kurnool | Sep 17, 2025 ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయాలని, ఎమ్మార్వోకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి DHPS జిల్లా సహాయ కార్యదర్శి వీరేష్, DHPS కార్యదర్శి కుమారస్వామి మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు గత నాలుగు సంవత్సరముల నుంచి నిధులు విడుదల చేస్తూ వాటిని ఇతర సంక్షేమ పథకాలు మళ్లించారని, ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సంవత్సరం అయిపోయిన కానీ ఇంతవరకు ఆ నిధులకు సంబంధించి ఎలాంటి ఆలోచన చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.