ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలో వర్షానికి పొంగిన వాగులు,వంకలు
ఉదయగిరి, వరికుంటపాడు మండలాల్లో బుధవారం కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వేకుజామున 3.30 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైది. ఉదయం 7గంటల వరకు కొనసాగింది. పొలాల్లో నీరు చేరింది. గ్రామాల్లోని వీధుల్లో సైడ్ కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు, మురుగు ఏకమై రోడ్లపై ప్రవహించాయి. విరువూరు సమీపంలోని పిల్ల పేరు వాగు ప్రవహిస్తోంది.