నారాయణపేట్: ప్రజావాణి కి 27 ఫిర్యాదులు: అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
నారాయణపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ప్రజావాణి హాల్లో నేడు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 27 ఫిర్యాదులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) సంచిత్ గంగ్వార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.