కనిగిరి పట్టణంలోని వెలుగు కార్యాలయంలో శనివారం పిఓఏల సమావేశం జరిగింది .ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీనిధి జనరల్ మేనేజర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ... వివోఏలు శ్రీనిధి ద్వారా అందజేసిన రుణాలను సకాలంలో రికవరీ చేయాలన్నారు. శ్రీనిధి రుణాల విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల నిర్వహణ పట్ల వివోఏలు అశ్రద్ధ వహించవద్దన్నారు. కేటాయించిన లక్ష్యాలను సాధించకుంటే వేతనాలు చెల్లించే పరిస్థితి ఉండదన్నారు. రికార్డుల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ అశోక్, సీసీలు పాల్గొన్నారు.