హిమాయత్ నగర్: కంటోన్మెంట్లోని శేషాచల కాలనీలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్
బస్తీ పర్యటనలో భాగంగా కంటోన్మెంట్లోని శేషాచల కాలనీలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదివారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీవాసులతో మాట్లాడే సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులు పలు సమస్యలు తెలపగా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కాలనీవాసులకు అవసరమైన పార్కును అభివృద్ధి చేస్తామని తెలిపారు. అంతర్గత రహదారులు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్తులైనను సరి చేయడం వంటి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.