కొత్త కండ్రిగ గ్రామంలో అంతిమయాత్రకు కూడా తప్పని కష్టాలు
తొట్టంబేడు: అంతిమయాత్రకు కూడా తప్పని కష్టాలు తొట్టంబేడు మండలం పెద్ద కన్నలి పంచాయతీ కొత్త కండ్రిగలో అంతిమయాత్ర చేపట్టడానికి గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు. కొత్త కన్నలి గ్రామ సమీపంలోని శ్మశాన వాటికలో వర్షపు నీరు చేరి చెరువు లాగా మారింది. దీంతో ఎవరైనా మరణిస్తే ఇక్కడ అంతిమయాత్ర చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్మశానం రోడ్డుకి కింద ఉండడంతో వర్షం వస్తే మొత్తం నీటితో నిండిపోతుంది. మృతదేహాన్ని పూడ్చడానికి కూడా కష్టాలు ఎదురవుతున్నాయి.