పాణ్యం: ఓర్వకల్లు హుసేనాపురం గ్రామం లో ప్లాంటేషన్ కార్యక్రమంలో ఐసీఎస్ శిక్షణాధికారులు
ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీఎస్ (ICS) ట్రైనీ అధికారులు పాల్గొన్నారు. అనంతరం అధికారులు NRGS పథకం కింద గోకులం షెడ్ నిర్మాణం గురించి వివరాలు తెలుసుకున్నారు.ZPHS పాఠశాలలో విద్యార్థుల మధ్య కబడ్డీ, హ్యాండ్బాల్, రన్నింగ్ వంటి క్రీడాపోటీలు నిర్వహించారు. అధికారులు విద్యార్థులతో మాట్లాడి వారి అభిరుచులు, విద్యా వివరాలు తెలుసుకున్నారు.