మహబూబాబాద్: మెట్లతండా శివారు, చిన్నవాగు సమీపంలో బోల్తా పడిన ఆటో నలుగురికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
మహబూబాబాద్: అదుపు తప్పి అటో బోల్తా మహబూబాబాద్ జిల్లా మొట్ల తండా శివారు చిన్న వాగు సమీపంలో బుధవారం యూరియా కోసం బయ్యారం మండలం ఉప్పలపాడుకు వెళ్తున్న రైతులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.