పుంగనూరు: విద్యార్థి తల పగలగొట్టిన భాష్యం పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
ఏఐఎస్ఎఫ్. రాష్ట్ర సమితి సభ్యులు. మున్నా, డిమాండ్
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో భాష్యం పాఠశాలలో 6 తరగతి చదువుతున్న విద్యార్థిని అల్లరి చేస్తున్నదని క్యారీ బ్యాగ్ తో తల పగలగొట్టిన టీచర్ సలీం భాషా పై. పాఠశాల యాజమాన్యంపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా ఆధ్వర్యంలో భాష్యం పాఠశాల వద్ద మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజవర్గ నాయకులు పాల్గొన్నారు.