జమ్మలమడుగు: కమలాపురం : నగర పంచాయతీ పరిధిలోని భోజన హోటళ్లను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ ప్రహలాద్
కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని పలు భోజన హోటళ్లను మంగళవారం కమలాపురం మున్సిపల్ కమిషనర్ ప్రహలాద్ మరియు మున్సిపల్ సిబ్బంది తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హోటల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్న, ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న, ప్రజల ఆరోగ్యాలను నష్టపరిచేది ఏమైనా ఉన్నాకానీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోటల్ యజమానులకు తెలియజేశారు.