కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఆలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు, భక్తుల ప్రత్యేక పూజలు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల్లోని శివాలయాలలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలను జరిపారు. అలాగే బుధవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం జరిపి ఆలయ ఆవరణలో భక్తులు దీపాలను వెలిగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.