కావలి: ముసునూరు రైల్వే అండర్ పాస్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి...
కావలిలోని ముసునూరు రాఘవేంద్ర కాలనీలో జరుగుతున్న రైల్వే అండర్ పాస్ పనులను ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో అధికారులు, నాయకులతో కలిసి పర్య వేక్షించారు. అండర్ పాస్ రెండు వైపులా తిరిగి పనులను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అండర్ పాస్ పూర్తి అయితే కావలి పట్టణ ప్రజలకు మార్గం సుగమం కానుందన్నారు. ప్రజలకు ముసునూరు రైల్వే గేటు వద్ద పడిగాపులు తప్పనున్నాయన్నారు.