దర్శి: దొనకొండ మండలంలోని పలు గ్రామాలలో ఏవో బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
Darsi, Prakasam | Sep 17, 2025 ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మల్లంపేట రుద్ర సముద్రం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నల్ల బర్లి పొగాకు ఎవరూ కూడా సాగు చేయ వద్దన్నారు. పొగాకు సాగు చేసేవారు పొగాకు బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులను వినియోగించుకోవాలని కోరారు. నేలలు టెస్టింగ్ చేయించుకున్న తర్వాత తగిన మోతాదుల ఎరువులను ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు.