భారత రాజ్యాంగ నిర్మాత బీ ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందరూ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.