కొడిమ్యాల: కొండగట్టు గ్రామంలో జనావాసాల మధ్యకు వచ్చిన భారీ కొండచిలువ భయాందోళనలో గ్రామ ప్రజలు
జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,కొండగట్టు లోని హోటల్ వద్ద బుధవారం రాత్రి 9 గంటల 40 నిమిషాలకు ఓ భారీ కొండచిలువ కలకలం రేపింది,కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారి పక్కన ఉన్న నైట్ హోటల్ వద్దకు ఓ భారీ కొండచిలువ వచ్చి చేరింది,దీంతో హోటల్‌కు వచ్చిన పలువురు హోటల్ నిర్వాహకులు కొండచిలువను చూసి పరుగులు తీశారు,కొండచిలువ హోటల్ ఆవరణలోనే దాదాపు గంటకు పైగా తచ్చాడింది, దీంతో హోటల్ నిర్వాహకులు స్నేక్ క్యాచర్ సమాచారం అందించారు,అక్కడికి చేరుకున్న స్నేక్యాచార్ అతి కష్టం మీద కొండచిలువను పట్టుకొని సురక్షిత ప్రాంతంలో తీసుకువెళ్లి వదిలేశారు,దీంతో హోటల్ వద్ద ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు,