గుంటూరు: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి
Guntur, Guntur | Sep 17, 2025 నగర పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గళ్ళ మాధవి బుధవారం సాయంత్రం మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. చిన్న వర్షానికే రోడ్లు మునిగిపోవడం, డ్రెయిన్లలో నీరు పారకపోవటం వంటి సమస్యలపై డివిజన్ వారీగా సమగ్రంగా రివ్యూ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళ మాధవి మాట్లాడుతూ నేను ఎన్నిసార్లు డీసిల్టేషన్ పనులు చేయాలని హెచ్చరించినా అధికారులు నిర్లక్ష్యం వహించడం వలన ఒక గంట వర్షానికే నగరం మునిగిపోయింది. అర్హత లేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి, పనులు ప్రారంభించకపోవడం అభివృద్ధికి అడ్డంకిగా మరిందన్నారు.