కంబదూరు మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ కమల మల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని బుధవారం రాత్రి సుమారు 11 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చనలు, అభిషేకాలు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు భారీగా తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు. ఆలయంతో పాటు పరిసరాలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఎక్కడ చూసినా భక్తులు సందడి, కోలాహలం నెలకొంది.