నిజాంపట్నం మండలంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది విస్తృత స్థాయి దాడులు
బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది విస్తృత దాడులు నిర్వహించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఈ భాస్కరరావు అన్నారు. ఈ దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మీటర్లను పరిశీలించి, సీజ్ చేశారు. విద్యుత్ అధికారుల అనుమతులు లేకుండా విద్యుత్ వినియోగం, మీటర్ లేకుండా, ఆక్వా సాగులో అక్రమంగా విద్యుత్ చౌర్యం చేస్తున్న వారి నుంచి నగదు రికవరీ చేశారు.