వినకొండ, చీకటిగలపాలెం మధ్య గల రైల్వే పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి
వినుకొండ, చీకటిగలపాలెం రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం గుర్తుతెలియని రైలు ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే ఎస్ఐ వెంకటాద్రి తెలిపారు. మృతుడు నల్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించి ఉన్నారని, అతని చేతిపై 'B R A' అని పచ్చబొట్టు ఉందని చెప్పారు. మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని, వివరాలు తెలిసినవారు తమను సంప్రదించాలని ఎస్ఐ కోరారు.