హిందూపురం మున్సిపల్ కార్యాలయం పై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. పక్క సమాచారంతో హిందూపురం పట్టణంలో వేకేట్ ల్యాండ్ టాక్స్ తగ్గిస్తామని 7వేల రూపాయలు రవి కుమార్ అనే వ్యక్తి వద్ద నుండి RI రామాంజనేయులు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతపురం ఏసీబీ కార్యాలయం హమీద్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ ఏసీబీ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. సోమన్న కర్నూలు ఏసీబీ డిఎస్పి మాట్లాడుతూ లంచం ఎవరైనా అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.