కామారెడ్డి: దేవునిపల్లిలో విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రమణారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవుని పల్లిలో విశ్వకర్మ జయంతి వేడుకలో కామారెడ్డి ఎమ్మెల్యే రమారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటానన్నారు. ప్రభుత్వం నుండి రావలసిన వాటిని వచ్చే విధంగా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.